Khelo India | శ్రీనగర్: ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో భాగంగా ఈనెలలో జరగాల్సిన రెండో దశ పోటీలు వాయిదా పడ్డాయి. జమ్ము కశ్మీర్‌లోని గుల్మార్గ్ వేదికగా ఈనెల 22 నుంచి 25 దాకా ఈ పోటీలు జరగాల్సి ఉంది.
అయితే గుల్మార్గ్లో ఈ క్రీడలకు తగినంత మంచు లేకపోవడంతో ఆటలను వాయిదా వేస్తున్నట్టు జమ్ముకశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. గత నెలలో మొదటి దశ పోటీలకు లేహ్ ఆతిథ్యమివ్వగా తెలంగాణ రెండు స్వర్ణాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.