న్యూఢిల్లీ : ఖేలో ఇండియా వింటర్గేమ్స్ రెండో దశ పోటీలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే లేహ్ వేదికగా తొలిదశ పోటీలు జరుగగా, మలిదశ ఈనెల 23 నుంచి 26వ తేదీ వరకు గుల్మార్గ్లో జరుగనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గుల్మార్గ్లో నాలుగు మెడల్ ఈవెంట్స్ స్కీ మౌంటెనీరింగ్, అల్పైన్ స్కీయింగ్, నోర్డిక్ స్కీయింగ్, స్నో బోర్డింగ్ పోటీలు జరుగుతాయని తెలిపారు.