Khelo India | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా-2026 పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర క్రీడాశాఖ సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పలు ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్నది. ఇప్పటికే ఖేలో ఇండియా-2025కు బీహార్ ఆతిథ్యం ఖరారు కాగా, 2026లో తెలంగాణకు అవకాశమిచ్చేందుకు క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయా సానుకూలంగా స్పందించినట్లు రాష్ట్ర క్రీడా సలహాదారు జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్టేడియాల్లో సౌకర్యాలు ఉన్నాయని ప్రభుత్వం తమ ప్రతిపాదనల్లో తెలిపింది.