ఫైనల్‌కు ఖమ్మం.. హైదరాబాద్‌కు తొలి ఓటమి
టీజీ20 లీగ్‌లో ఖమ్మం ఏసెస్ సంచలన విజయంతో ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. లీగ్‌లో పరాభవమెరుగని హైదరాబాద్ ఈ-చాంపియన్స్‌కు క్వాలిఫయర్స్-1లో ఓటమి రుచిని చూపించింది.
- క్వాలిఫయర్-2కు కరీంనగర్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీజీ20 లీగ్‌లో ఖమ్మం ఏసెస్ సంచలన విజయంతో ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. లీగ్‌లో పరాభవమెరుగని హైదరాబాద్ ఈ-చాంపియన్స్‌కు క్వాలిఫయర్స్-1లో ఓటమి రుచిని చూపించింది. ఇరుజట్ల మధ్య గురువారం రాత్రి జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో ఖమ్మం.. 10 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 రన్స్ చేసింది. మికిల్ జైస్వాల్ (76), జీఎస్కే రెడ్డి (40) రాణించారు. హైదరాబాద్ 20 ఓవర్లకు 190/8 వద్దే ఆగిపోయింది. ఆ జట్టు తరఫున వికాస్ (69) టాప్ స్కోరర్‌గా నిలిచారు.
అంతకుముందు జరిగిన ఎలిమినేటర్‌లో కరీంనగర్ డైమండ్స్ 75 పరుగుల తేడాతో రంగారెడ్డి రైజర్స్‌ను చిత్తుచేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. టోర్నీలో సెంచరీల మోత మోగిస్తున్న కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (61 బంతుల్లో 137, 11 ఫోర్లు, 10 సిక్స్‌లు) మూడో శతకంతో చెలరేగగా ఆ జట్టు 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 238 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో కరీంనగర్ బౌలర్ ఆశిష్ శ్రీవాత్సవ్ (5/16) ఐదు వికెట్ల ప్రదర్శనతో రంగారెడ్డి 16.3 ఓవర్లలో 163 పరుగులకే కుప్పకూలింది. శుక్రవారం జరిగే క్వాలిఫయర్స్-2లో కరీంనగర్.. హైదరాబాద్‌తో తలపడనుంది. ఆదివారం ఫైనల్ జరుగుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

