నార్తాంప్టన్(ఇంగ్లండ్) : ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్ ‘ఏ’ జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. ఓవర్‌నైట్ స్కోరు 192/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్ లయన్స్.. ఖలీల్ అహ్మద్(4/70) ధాటికి 327 పరుగులకు ఆలౌటైంది. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ఖలీల్ పేస్ ధాటికి ఇంగ్లండ్ 10 పరుగుల తేడాతో నాలుగు కీలక వికెట్లు చేజార్చుకుంది. వికెట్‌కు ఇరువైపులా స్వింగ్ రాబట్టిన ఖలీల్..ఇంగ్లండ్ బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వలేదు.
ఖలీల్ విజృంభణతో జోర్డాన్ కాక్స్(45), జేమ్స్ ర్యూ (10), జార్జ్ హిల్ (0), క్రిస్‌వోక్స్(5) వెంటవెంటనే ఔటయ్యారు. అయితే ఆఖర్లో జోష్ టంగ్ (36 నాటౌట్), ఫర్హాన్ అహ్మద్ (24) రాణించడంతో ఇంగ్లండ్ 300ల మార్క్ అందుకుంది. అన్శుల్ కంబోజ్ (2/56), తుషార్దేశ్పాండే(2/62) రెండేసి వికెట్లు తీశారు. 21 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్ ‘ఏ’ 18 ఓవర్లలో జైస్వాల్ (5) వికెట్ కోల్పోయి 75 పరుగులు చేసింది. రాహుల్ (37), కెప్టెన్ ఈశ్వరన్ (28) క్రీజులో ఉన్నారు. హిల్‌కు ఏకైక వికెట్ దక్కింది.