IPL 2024 DC vs CSK : భారీ ఛేదనలో చెన్నై చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లను కోల్పోయింది. తొలి ఓవర్లోనే రుతురాజ్ గైక్వాడ్(1)ను ఔట్ చేసిన ఖలీల్ అహ్మద్ మరోసారి దెబ్బకొట్టాడు. ఫామ్లో ఉన్న రచిన్ రవీంద్ర (2)ను వెనక్కి పంపాడు. అతడి విజృంభణతో ఒత్తిడిలో పడిన సీఏస్కే 4 ఓవర్లకు 13 రన్స్ చేసిందంతే. ప్రస్తుతం అజింక్యా రహానే(10), డారిల్ మిచెల్(2)లు ఆడుతున్నారు. ఇక చెన్నై గెలుపు భారమంతా మిడిలార్డర్పైనే ఉంది.
తొలుత ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్(13), చిచ్చరపిడుగు డేవిడ్ వార్నర్(52)లు అర్ధ శతకాలు బాదడంతో చెన్నై ముందు 191 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన ఓపెనర్ పృథ్వీ షా(43) విలువైన ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో పంత్ సుడిగాలిలా చెలరేగాడు. సీఎస్కే బౌలర్లో పథిరన రెండు వికెట్లు పడగొట్టాడు.