అహ్మదాబాద్: దేశవాళీ క్రికెట్ రంజీ ట్రోఫీ(Ranji Trophy) ఫైనల్లోకి కేరళ దాదాపు ప్రవేశించింది. తొలి సెమీస్ మ్యాచ్‌లో ఇవాళ అయిదో రోజు ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. దీంతో దాదాపు ఫైనల్లో అడుగుపెట్టే అవకాశాన్ని కేరళ కన్ఫర్మ్ చేసుకున్నది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేరళ 457 రన్స్ చేయగా, గుజరాత్ జట్టు 455 రన్స్‌కు ఆలౌటైంది.
1⃣ wicket in hand
2⃣ runs to equal scores
3⃣ runs to secure a crucial First-Innings LeadJoy. Despair. Emotions. Absolute Drama! 😮
Scorecard ▶️ https://t.co/kisimA9o9w#RanjiTrophy | @IDFCFIRSTBank | #GUJvKER | #SF1 pic.twitter.com/LgTkVfRH7q
— BCCI Domestic (@BCCIdomestic) February 21, 2025
అయితే ఇవాళ అయిదో రోజు మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. చివరి రోజు కేరళ ఆధిక్యాన్ని దాటేందుకు గుజరాత్ మరో 28 పరుగలు చేయాల్సి ఉంది. గుజరాత్ వద్ద కేవలం మూడు వికెట్లు ఉన్నాయి. అయితే కేరళ స్పిన్నర్ ఆదిత్య సార్వతే.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో గుజరాత్ ఆధిక్యాన్ని సాధిస్తుందనుకున్న సమయంలో.. కేరళ స్పిన్నర్ ఆదిత్య ఆ జట్టుకు చెక్ పెట్టేశాడు. చివరి మూడు వికెట్లను అతనే తీసుకున్నాడు. కేవలం రెండు పరుగుల తేడాతో ఆధిక్యాన్ని కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ ఇప్పటికే 34 రన్స్ ఆధిక్యాన్ని సాధించింది. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా కేరళ ఫైనల్ ఎంట్రీ ఖరారైనట్లే.
రంజీ ట్రోఫీలో 68 ఏళ్ల తర్వాత కేరళ జట్టు తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించింది. చాలా నాటకీయమైన రీతిలో ఫైనల్ ఎంట్రీ దక్కింది. క్వార్టర్స్ మ్యాచ్‌లో కూడా ఒక్క పరుగు లీడ్‌తో సెమీస్‌కు కేరళ ఎంటర్ అయ్యింది. జమ్మూకశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో.. కేరళ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు ఆధిక్యాన్ని సాధించింది. అయితే మ్యాచ్ డ్రా కావడంతో.. ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా ఆ జట్టు సెమీస్‌లోకి ఎంటర్ అయ్యింది.
విదర్భతో జరుగుతున్న రెండో సెమీస్ మ్యాచ్‌లో.. ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 407 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే ఇవాళ అయిదో రోజు కడపటి వార్తలు అందేసరికి ఆ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 208 రన్స్ చేసింది. మరో 50 ఓవర్లలో ముంబై 198 రన్స్ చేయాల్సి ఉంది. ఒకవేళ మ్యాచ్ ఓడితే.. ముంబై ఫైనల్ ఆశలు గల్లంతు అయినట్లే. ఒకవేళ మ్యాచ్ డ్రా అయినా.. ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా విదర్భ ఫైనల్లోకి వెళ్తుంది.