Jalaj Saxena : రంజీల్లో కేరళ స్పిన్నర్ జలజ్ సక్సేనా(Jalaj Saxena) సంచలన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. తిరువనంతపురంలో బెంగాల్(Bengal)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 వికెట్లు పడగొట్టాడు. మొదటి తొమ్మిది వికెట్లు ఖాతాలో వేసుకొని కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 21.1 ఓవర్లు బౌలింగ్ చేసిన జలజ్ 68 పరుగులిచ్చి 9 వికెట్లు నేలకూల్చాడు.
దాంతో, బెంగాల్‌పై ఈ ఫీట్ సాధించిన తొలి బౌలర్‌గా జలజ్ రికార్డు సృష్టించాడు. ఈ లెగ్ స్నిన్నర్ ధాటికి బెంగాల్ జట్టు 180 పరుగులకే ఆలౌటయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను 265 పరుగులకే డిక్లేర్ చేసిన కేరళ.. బెంగాల్ ముందు 448 రన్స్ టార్గెట్ పెట్టింది.
జలజ్ సక్సేనాను అభినందిస్తున్న కెప్టెన్ సంజూ శాంసన్
తొలుత బ్యాటింగ్ చేసి కేరళ జట్టులో ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. సచిన్ బేబి(124), అక్షయ్ చంద్రన్(106)లు శతకాల మోత మోగించడంతో భారీ స్కోర్ దిశగా పయనించింది. అయితే.. బెంగాల్ బౌలర్లు షహబాజ్ అహ్మద్ నాలుగు, అంకిత్ మిశ్రా మూడు వికెట్లు తీయడంతో 363 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించన బెంగాల్ జట్టులో ఓపెనర్ అభిమన్యు మిథున్(72) హాఫ్ సెంచరీ సాధించాడు. ఫిఫ్టీతో జోరుమీదున్న అతడిని ఔట్ చేసిన జలజ్ సక్సేనా.. ఆ తర్వాత వరుస పెట్టి వికెట్లు తీశాడు. అతడి ధాటికి వచ్చినవాళ్లు వచ్చినట్టు డగౌట్‌కు క్యూ కట్టారు.