Viral Video : నూతన ఫ్లేవర్లను జోడిస్తూ ఫేవరెట్ డిష్‌లకు తాజాతనం తెచ్చేందుకు మనలో చాలా మంది ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఇక పాస్తాపై ఓ మహిళా కుక్ ఇలాంటి ప్రయోగం చేయడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
దేశీ పాస్తాను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే ఇప్పుడు క్లాసిక్ ఇండియన్ చోలే గ్రేవీలో ఓ చెఫ్ పాస్తా తయారుచేయడం ఇంటర్నెట్లో వైరలవుతోంది. చాండ్లర్షేర్స్ఫుడ్ అనే ఇన్స్టాగ్రాం అకౌంట్ ఇన్‌స్టా రీల్‌ను షేర్ చేసింది. చోలే గ్రేవీలో పాస్తా తయారుచేస్తే ఎలా ఉంటుందని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ ఇన్‌స్టా పోస్ట్ ఇప్పటివరకూ ఏకంగా 40 లక్షల వ్యూస్‌ను దక్కించుకుంది. ఇదేం ఫుడ్ కాంబినేషన్ అని పలువురు నెటిజన్లు చెఫ్‌పై ఓ రేంజ్లో ఫైరవగా, మరికొందరు యూజర్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
Read More :
Watch: బస్సులో బూట్లతో కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్