Watch: కదులుతున్న రైలు నుంచి దూకిన బాలిక.. తర్వాత ఏం జరిగిందంటే?
Girl Jumps Off Running Train | కదులుతున్న రైలు నుంచి ఒక బాలిక దూకింది. (Girl Jumps Off Running Train) రైలు పట్టాల పక్కన బోర్లా పడటంతో గాయపడింది. ఆ రైలులోని ఒక వ్యక్తి రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
న్యూఢిల్లీ: కదులుతున్న రైలు నుంచి ఒక బాలిక దూకింది. రైలు పట్టాల పక్కన బోర్లా పడటంతో గాయపడింది. ఆ రైలులోని ఒక వ్యక్తి రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. వేగంగా వెళ్తున్న ఒక రైలు డోర్ వద్ద ఒక అమ్మాయి కూర్చొంది. ఒక స్టేషన్ సమీపించడంతో ఆ రైలు వేగం తగ్గుతుంది. దీంతో కదులుతున్న ఆ రైలు నుంచి ఆ యువతి దూకింది. అదుపుతప్పి పట్టాల పక్కగా బోర్లా పడింది. ఆమె ముఖానికి గాయాలైనట్లు తెలుస్తున్నది. అయితే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అన్నది తెలియలేదు.
కాగా, ఆ రైలులోని ఒక వ్యక్తి రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్‌ను ఒక యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఇడియట్ దీనిని రికార్డ్ చేయడంలో ఎక్కువ ఆసక్తి చూపాడని, రైలు నుంచి ఆమె దూకడాన్ని ఆపలేదని అందులో పేర్కొన్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. ఆ అమ్మాయి నిర్లక్ష్యపు ప్రవర్తనపై కొందరు మండిపడ్డారు. అలాగే వీడియో తీసిన వ్యక్తి ఆమెను నిలువరించలేకపోవడాన్ని మరి కొందరు విమర్శించారు.
మరోవైపు ఆ వ్యక్తి యువతి చేతులు పట్టుకుని ఆపి ఉంటే, ఆమె అరిస్తే రైలులోని ప్రయాణికులు తప్పుగా అర్ధం చేసుకుని అతడ్ని కొట్టేవారని కొందరు అభిప్రాయపడ్డారు. రైలు వేగంగా కదులుతున్నదంటూ ఆ అమ్మాయిని అతడు హెచ్చరించాడని, ఇందులో ఆ వ్యక్తి తప్పేమి లేదని మరికొందరు సమర్థించారు.
the idiot is more keen on shooting it …
not stopping her! 😩 pic.twitter.com/IYtHHcNoiN— JΛYΣƧΉ (@baldwhiner) February 8, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Falls
- Girl
- Jumps Off
- Running Train
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

