Taiwan Earthquake : తూర్పు తైవాన్ హులిన్ కౌంటీలోని షౌఫెంగ్ టౌన్షిప్లో సోమవారం కేవలం 9 నిమిషాల వ్యవధిలో ఐదుసార్లు భూమి కంపించడం కలకలం రేపింది. స్దానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5.08 గంటల నుంచి 5.17 గంటల మధ్య భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇక రెండు వారాల కిందట తూర్పు తైవాన్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో నలుగురు వ్యక్తులు మరణించగా 700 మందికిపైగా గాయాలయ్యాయి.
స్వల్ప విరామం అనంతరం తాజాగా 9 నిమిషాల వ్యవధిలో ఐదు భూప్రకంపనలు చోటుచేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక హులిన్ సిటీని ఏప్రిల్ 3న వణికించిన భూకంపంలో ముగ్గురు మరణించగా, పెద్దసంఖ్యలో ప్రజలకు గాయాలయ్యాయని నేషనల్ ఫైర్ ఏజెన్సీ తెలిపింది. భూకంప కేంద్రమైన హులియన్ కౌంటీలోనే ఈ ఘటనలో 132 మందికి గాయాలయ్యాయి.
Read More :
Mohanlal | మోహన్‌లాల్-శోభన మళ్లీ కలిశారు.. L 360 లాంఛ్ స్టిల్స్ వైరల్