ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రస్తుతం ఫోన్ బూత్ ఫిల్మ్ షూట్ చేస్తోంది. అయితే ఆదివారం ఆమె స్టార్ స్పోర్ట్స్ స్టూడియోకు గెస్ట్‌గా వచ్చింది. సౌతాఫ్రికాతో భారత్ తలపడనున్న నేపథ్యంలో ఆమె స్టూడియోను విజిట్ చేసింది. క్యూటీ కత్రినా కాసేపు స్టూడియోలో బ్యాటింగ్ చేసింది. టర్బనేటర్ హర్భజన్ వేసిన బంతుల్ని ఆమె తన బ్యాట్‌తో కొట్టింది. ఇక అక్కడ ఉన్న యాంకర్లు ఆ మూమెంట్‌ను తెగ ఎంజాయ్ చేశారు. సిక్సర్ కొట్టాలంటూ భజ్జీ బంతి వేయగా.. ఆ బాల్‌ను కత్రినా గట్టిగా కొట్టింది. ఎల్లో డ్రెస్సులో అట్రాక్ట్ చేసిన కత్రినా.. బ్యాట్‌తోనూ తన అందాల్ని ప్రదర్శించింది. కత్రినా బ్యాటింగ్ వీడియో ఇదే.