సెయింట్ లూయిస్(అమెరికా): చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, గ్యారీ కాస్పరోవ్ మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతున్నది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తలపడుతున్న ఈ ముఖాముఖి పోరులో ఆధిక్యం చేతులు మారుతున్నది. క్లచ్ చెస్ లెజెండ్స్ టోర్నీ 10వ గేమ్‌లో ఆనంద్‌పై కాస్పరోవ్ విజయం సాధించాడు.
దీంతో ప్రస్తుతం కాస్పరోవ్ 13-11తో ఆనంద్‌పై ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. హోరాహోరీగా సాగిన ఆట రెండో గేమ్‌లో కడదాకా పోరాడిన ఆనంద్ డ్రా చేసుకున్నాడు.