IPL 2025 : మూడేళ్ల తర్వాత ఐపీఎల్ ఆడుతున్న కరుణ్ నాయర్(50) అర్ధ శతకం సాధించాడు. తొలి మ్యాచ్‌లోనూ వీరబాదుడుతో 22 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టాడీ హిట్టర్. బుమ్రా బౌలింగ్‌లో 6, 4, 6 బాదిన కరుణ్.. ఆఖరి బంతికి డబుల్స్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో, ఢిల్లీ పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 72 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఢిల్లీ విజయానికి ఇంకా 84 బంతుల్లో 134 రన్స్ కావాలి.
భారీ ఛేదనలో తొలి బంతికే వికెట్ పడినా ఢిల్లీ ఇన్నింగ్స్ దూకుడుగా సాగుతోంది. ఢిల్లీ క్యాపటిల్స్ బ్యాటర్ కరుణ్ నాయర్(50 నాటౌట్) బౌండరీలతో అలరిస్తున్నాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఈ హిట్టర్ అలవోకగా బంతిని బౌండరీకి తరలిస్తూ ముంబై ఇండియన్స్‌ను ఒత్తిడిలోకి నెడుతున్నాడు. చాహర్ వేసిన ఓవర్లో బౌండరీతో జట్టు స్కోర్ 50 దాటించాడు. అభిషేక్ పొరెల్(16)తో కలిసి రెండో వికెట్‌కు 72రన్స్ జోడించాడు.