Karun Nair : ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన కరుణ్ నాయర్ (Karun Nair) రంజీ ట్రోఫీలో సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో గోవా జట్టుపై శతకం(174 నాటౌట్)తో రెచ్చిపోయిన నాయర్ ఇప్పుడు కేరళపైనా బ్యాట్ ఝులిపించాడు. మొదటి రోజున ఆరంభంలోనే కష్టాల్లో పడిన కర్నాటకను సెంచరీతో ఆదుకున్నాడీ సొగసరి బ్యాటర్. వరుసగా రెండో శతకంతో రెచ్చిపోయిన నాయర్ భారత టెస్టు జట్టులో మళ్లీ చోటు ఆశిస్తున్నాడు. తనలాంటి బ్యాటర్‌ను ఒక్క సిరీస్‌కే పరిమితం చేయడం తగదని సెలెక్టర్లను ప్రశ్నిస్తున్న అతడు.. తన రంజీ ఫామ్‌ను లెక్కలోకి తీసుకోవాలని కోరుతున్నాడు.
క్రికెట్ నాకో అవకాశం ఇవ్వు అని సెలెక్టర్లను ఆకర్షించిన నాయర్ ఇంగ్లండ్ పర్యటనలో తేలిపోయాడు. ఒకేఒక అర్ధశతకం మినహా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు అతడు. ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 205 రన్స్ చేశాడంతే. దాంతో.. నాయర్‌పై వేటు వేశారు సెలెక్టర్లు. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు అతడి స్థానంలో సాయి సుదర్శన్‌కు అవకాశమిచ్చారు. కోచ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మద్దతు ఉండడంతో.. సుదర్శన్‌కు ఢోకా లేనట్టే. ఈ పరిస్థితుల్లో తానకు మరొక ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్ను నాయర్ రంజీలో శతకాలతో పునరాగమనంపై ఆశలు పెట్టుకున్నాడు. త్వరలో జరుగబోయే దక్షిణాఫ్రికా సిరీస్‌కు తీసుకుంటారా? లేదా? అని సెలెక్టర్లకు సవాల్ విసురుతున్నాడీ డాషింగ్ బ్యాటర్.
Another day, another century for Karun Nair 🔥
After an unbeaten ton against Goa, he continues his red-hot form with another masterpiece against Kerala 👏🏏@karun126 pic.twitter.com/DpSU40N4y0
— CricTracker (@Cricketracker) November 1, 2025
గ్రూప్ బీలోని కర్నాటక టాస్ గెలిచి బ్యా టింగ్ ఎంచుకుంది. శుభారంభంతో కేరళ బౌలర్లను ఒత్తిడికి గురిచేయాలనుకున్న ఓపెనర్ల వ్యూహం ఫలించలేదు. కేవీ అనీశ్(8), మయాంక్ అగర్వాల్(5)లు 13 పరుగులకే డగౌట్ చేరారు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్(142 నాటౌట్) క్రీజులో పాతుకుపోయాడు. ఆపద్భాందవుడి పాత్ర పోషించిన అతడు క్రిష్ణన్ శ్రీజిత్(65), రవిచంద్రన్ స్మరన్(88 నాటౌట్)లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దాంతో.. మొదటి రోజు ఆట ముగిసే సరికి కర్నాటక 319-3తో పటిష్ట స్థితిలో నిలిచింది.
వడోదరాలో వర్షం కారణంగా బెంగాల్, బరోడా జట్లమధ్య తొలిరోజు మ్యాచ్ సాధ్యం కాలేదు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యశస్వీ జైస్వాల్ హాఫ్ సెంచరీతో రాణించినా.. మిగతావారు చేతులెత్తేశారు. దాంతో.. ముంబై 254కే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 10 రన్స్ చేసిన రాజస్థాన్ ఇంకా 244 పరుగులు వెనకబడి ఉంది. అభిషేక్ రెడ్డి(76), శ్రీకర్ భరత్(93)లు అర్ద శతకాలు బాదడంతో ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది ఆంధ్ర.