హైదరాబాద్, ఆట ప్రతినిధి : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) 69వ జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ యువ స్విమ్మర్ కర్ర శివాని పతక జోరు కొనసాగుతున్నది. ఈ టోర్నీలో ఇదివరకే స్వర్ణం, రజతం గెలిచిన ఆమె..
మంగళవారం జరిగిన అండర్-14 గర్ల్స్ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో (01:09:.97 సెకన్లు) రెండో స్థానంలో నిలిచి వెండి పతకం కైవసం చేసుకుంది. అండర్-19 గర్ల్స్ 50 మీటర్ల ఫ్రీస్టయిల్లో సుదీక్ష కృష్ణ (28.24 సెకన్లు) కాంస్యం గెలిచింది.