Karnataka cricket body | బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో (stampede) 11 మంది మృతిచెందడం యావత్ జాతిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటనపై నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై ఆర్సీబీ, కర్ణాకట క్రికెట్ అసోసియేషన్ (Karnataka State Cricket Association), ఈవెంట్ మేనేజర్లపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తమపై దాఖలైన కేసును సవాల్ చేస్తూ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) హైకోర్టును ఆశ్రయించింది (Bengaluru Stampede). కేఎస్సీఏ అధ్యక్షుడు రఘురామ్ భట్, కార్యదర్శి ఎ.శంకర్, కోశాధికారి ఈఎస్ జయరాం సంయుక్తంగా కర్ణాటక హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. తమపై నమోదైన కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. వీరి పిటిషన్పై ఇవాళ మధ్యాహ్నం విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది.
Also REad..
Kamal Haasan | రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన కమల్ హాసన్