హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఈనెల 6 నుంచి 8 మధ్య తెలంగాణ స్కాష్ రాకెట్స్ అసోసియేషన్, గేమ్ పాయింట్ సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్కాష్ చాంపియన్షిప్-2024 ఘనంగా ముగిసింది. మూడురోజుల పాటు హోరాహోరిగా జరిగిన ఈ పోటీలలో భాగంగా అండర్ -13, అండర్ -15, అండర్ -17 విభాగాల్లో యువ క్రీడాకారులు తమ సత్తాచాటగా పురుషులు, మహిళల విభాగాల్లోనూ ప్యాడ్లర్లు ఆకట్టుకున్నారు.
అండర్-13 బాలుర విభాగంలో పులి తనుజ్ రెడ్డి విజేతగా నిలవగా అండర్-15 గర్ల్స్ విభాగంలో ఆర్య ద్వివేది టైటిల్ నెగ్గింది. అండర్-17 బాయ్స్ కేటగిరీలో రాజ్వీర్ విజేతగా నిలిచాడు. మెన్స్ కేటగిరీలో కరుణ్ వశిష్ట్, ఉమెన్స్ కేటగిరీలో ద్వివేది ఫైనల్లో జయకేతనం ఎగురవేశారు.