IND vs PAK : ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు ఉత్కంఠ నడుస్తోంది. టీమిండియా ఈ గేమ్‌ను బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. పహల్గాంలో ఉగ్రవాదుల (Pahalgham Attack) దాడిని మరిచిపోయారా? శత్రు దేశంతో క్రికెట్ ఏంటీ? అని పలువురు సోషల్ మీడియాలో బీసీసీఐ (BCCI)ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దాయాదుల పోరును దృష్టిలో ఉంచుకొని మాట్లాడిన కపిల్.. కామెంటేటర్లు, అభిమానులను రాజకీయం చేయవద్దని అభ్యర్థించాడు.’సెప్టెంబర్ 14న జరుగబోయే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని కొందరు అంటున్నారు. సోషల్ మీడియాలోనూ పోస్ట్‌లు వెలుస్తున్నాయి. టీమిండియా షార్జా స్టేడియానికి వెళ్లి పాక్‌పై విజయం సాధించాలి. క్రికెట్ ఆడాల్సిన వారు.. ఆటపై దృష్టి సారించాలి. ఇంతకుమించి చెప్పాల్సిందేమీ లేదు. ఈ విషయాన్ని పెద్దది చేయకండి. దౌత్యం, రాజకీయ పరమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి టీమిండియా ఆటగాళ్లను వాళ్ల పని చేయనివ్వండి’ అని మీడియా సాక్షిగా అభిమానులను ఈ వెటరన్ ప్లేయర్ విజ్ఞప్తి చేశాడు.
VIDEO | Ahead of the India-Pakistan clash, cricketer Kapil Dev expressed his hopes for the Men in Blue, saying he wants to see India lift the Asia Cup trophy and bring it home. “The Indian players should stay focused solely on the game. They have a good team and must win. Players… pic.twitter.com/Iczz8NjAXp
— Press Trust of India (@PTI_News) September 11, 2025
Nation First, I am not Watch IND vs PAK Asia Cup 2025 #Asiacup2025 pic.twitter.com/i77jZMdjJm
— Cric TalK Adda (@CricTalKAdda) September 6, 2025
అంతేకాదు యూఏఈపై భారత జట్టు రికార్డు విజయాన్ని కపిల్ కొనియాడాడు. ప్రస్తుత జట్టు చాలా బాగుంది. ఆసియా కప్ తొలి మ్యాచ్‌లోనే అద్భుత విజయం సాధించింది. ఫైనల్ వరకూ ఇదే జోరు చూపించి ట్రోఫీతో స్వదేశం రావాలని కోరుకుంటున్నా అని కపిల్ అన్నాడు.
చిరకాల ప్రత్యర్ధుల మ్యాచ్‌పై బీసీసీఐ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆంక్షలు లేనందున భారత జట్టు టోర్నీలో అన్ని మ్యాచ్‌లు ఆడుతుందని స్పష్టం చేసింది. అయితే.. శత్రుదేశమైన పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లకు మాత్రం ఆస్కారమే లేదని కూడా తేల్చి చెప్పింది బీసీసీఐ. దాంతో.. సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. మూడేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్‌లో.. రెండేళ్ల క్రితం టీ20 వరల్డ్ కప్ గ్రూప్ దశలో పాక్‌ను చిత్తు చేసిన భారత జట్టు ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే కసితో ఉంది.
పదిహేడో సీజన్ ఆసియా కప్‌ను భారత జట్టు భారీ విజయంతో ఆరంభించింది. కుల్దీప్ యాదవ్ (4-7), శివం దూబే(3-4) విజృంభణతో ఆతిథ్య యూఏఈ జట్టును 57 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆపై స్వల్ప లక్ష్యాన్ని 4.3 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(30), శుభ్‌మన్ గిల్ (19 నాటౌట్) దంచికొట్టడంతో మరో 93 బంతులు ఉండగానే జయభేరి మోగించింది టీమిండియా.