ఢిల్లీ: విదేశీ పర్యటనల నిమిత్తం వెళ్లే భారత క్రికెటర్ల కుటుంబాల విషయంలో పరిమితులు (45 రోజుల టూర్కు రెండు వారాలు, చిన్న టూర్లు అయితే ఒక వారం) విధించడాన్ని తప్పుబట్టిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి దిగ్గజ సారథి కపిల్ దేవ్ మద్దతుగా నిలిచాడు.
ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ మాట్లాడుతూ.. ‘అది బోర్డు నిర్ణయం. దాని గురించి నాకు తెలియదు. నా అభిప్రాయం ప్రకారమైతే క్రికెటర్లకు కుటుంబ మద్దతు అవసరం. దాని కంటే ముందు మీకు జట్టు ముఖ్యం. మా కాలంలో అయితే విదేశీ పర్యటనలలో మొదట కొన్ని రోజులు పూర్తిగా ఆట మీదే దృష్టి సారించి తర్వాత కుటుంబాలను తీసుకెళ్తామని బోర్డుకు చెప్పేవాళ్లం’ అని తెలిపాడు.