హైదరాబాద్: స్టార్ క్రికెటర్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేలు, టెస్టుల్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. 2011లో జింబాబ్వేపై టీ 20ల్లోకి ప్రవేశించిన కేన్ మామ.. అంతర్జాతీయంగా 93 టీ20లు ఆడి 2,575 పరుగులు చేశాడు. ఇందులో 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 95. చివరి మ్యాచ్‌ను 2024లో ఇంగ్లాండ్‌పై ఆడాడు. కివీస్ తరపున టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. 2021లో న్యూజిలాండ్ జట్టును ప్రపంచకప్ ఫైనల్‌ను తీసుకొచ్చాడు. 2016 ప్రపంచకప్‌లో జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 75 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్‌లోనూ తనదైన శైలిలో మెరుపులు మెరిపించిన కేన్ మామ.. సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహించాడు.
కాగా, తన అతర్జాతీయ టీ20 కెరీర్ పట్ల కేన్ విలియమ్సన్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ ఫార్మట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని భావించానని, ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తే.. టీ20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టు కూర్పుపై సెలెక్టర్లకు ఓ స్పష్టత ఏర్పడుతుందన్నాడు. మున్ముందు జట్టు ఆడబోయే సిరీస్‌లకు సన్నద్ధం కావాల్సి ఉందని, మెకరికల్లాంటి యువ క్రికెటర్లకు అవకాశం లభిస్తుందని తెలిపాడు. మిచెల్ శాంట్నర్‌ను అద్భుతమైన కెప్టెన్‌గా అభివర్ణించాడు.