సోమవారం 23 నవంబర్ 2020
Sports - Nov 19, 2020 , 00:23:16

వన్టేలకు,టీ20లకు

వన్టేలకు,టీ20లకు

రిచర్డ్‌సన్‌ దూరంసిడ్నీ: భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల నుంచి ఆస్ట్రేలియా పేసర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌ తప్పుకున్నాడు. కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో కుటుంబంతోనే  ఉండేందుకు అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ అభ్యర్థనను ఆమోదించిన ఆస్ట్రేలియా సెలెక్టర్లు అతడి స్థానంలో ఆండ్రూ టైని జట్టులోకి తీసుకున్నారు. ‘భార్య, ఇటీవలే జన్మించిన కుమారుడితో ఉండేందుకు జట్టు నుంచి వైదొగాలనుకుంటున్న నిర్ణయాన్ని రిచర్డ్‌సన్‌.. సెలెక్టర్లకు తెలియజేశాడు’ అని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) వెల్లడించింది. రిచర్డ్‌సన్‌ కష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నాడని, తాము అతడికి మద్దతు తెలుపుతున్నామని సెలెక్టర్‌ ట్రేవర్‌ హాన్స్‌ చెప్పారు. కేన్‌ ప్రస్తుతం అడిలైడ్‌లో కుటుంబంతో ఉన్నాడు. కాగా ఇటీవల అడిలైడ్‌లో కరోనా కేసులు నమోదవుతుండడంతో డిసెంబర్‌ 17వ తేదీ నుంచి ఇక్కడ భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగాల్సిన డే అండ్‌ నైట్‌ తొలి టెస్టుపైనా సందిగ్ధత నెలకొంది.