Kambala | ‘కంబల’ పోటీలు షురూ.. బురద నీళ్లలో దౌడు తీయనున్న 180 జతల దున్నలు
Kambala : కర్నాటక సాంప్రదాయ కంబల(Kambala) పరుగు పందెం పోటీలు ప్రారంభమయ్యాయి. కర్నాటక రాష్ట్రం లోని తీర ప్రాంతాలకు చెందిన పురాతనమైన ఈ ఆట ఇప్పుడు బెంగళూరులోని ప్రజలకు వినోదం పంచనుంది. నవంబర్ 25 రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో కంబల పోటీలు షురూ అయ్యాయి. ఈ సందర్భంగా పలు ప్రాంతాలకు చెందిన...
Kambala : కర్నాటక సాంప్రదాయ కంబల(Kambala) పరుగు పందెం పోటీలు ప్రారంభమయ్యాయి. కర్నాటక రాష్ట్రం లోని తీర ప్రాంతాలకు చెందిన పురాతనమైన ఈ ఆట ఇప్పుడు బెంగళూరులోని ప్రజలకు వినోదం పంచనుంది. నవంబర్ 25 రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో కంబల పోటీలు షురూ అయ్యాయి. ఈ సందర్భంగా పలు ప్రాంతాలకు చెందిన వాళ్లు తమ దున్నలు అందంగా అలంకరించి తీసుకొచ్చారు.
ఈ పోటీల్లో 180కి పైగా జతల దున్నలు, వాటి యజమానులు, జాకీలు, కేర్ టేకర్స్ పాల్గొననున్నారు. దున్నలు పరుగుతీయడం కోసం నిర్వాహకులు 135 మీటర్ల పొడవుతో రెండు బురద గుంటలను ఏర్పాటు చేశారు. ఇక పోటీ మొదలవ్వగానే యువకులు వాటిని బురదనీళ్లలో పరుగుతీయిస్తారు. ఎవరి దున్నలు వేగంగా పరిగెత్తితే వాళ్లు గెలిచినట్టు. బురద చిమ్ముకుంటూ దున్నలు దౌడు తీస్తుంటే ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ, బిగ్గరగా అరుస్తూ మస్త్ ఎంజాయ్ చేస్తారు.

కంబల అనేది 400 ఏండ్ల క్రితం నాటి ఆట. ముఖ్యంగా కర్నాటకలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఈ వేడుకను నిర్వహించేవి. ఏండ్లుగా మారుమూల ప్రాంతాలకే పరిమితమైన ఈ ఆటను కొందరు నగర ప్రజలకు పరిచయం చేయాలనుకున్నారు. బెంగళూరులోని మూడబిద్రి, పుత్తూర్, బెల్తంగడి, కర్కాల, దక్షిణ కన్నడ, ఉడిపి, మంగళూరు జిల్లాలకు చెందిన 70కి పైగా సంస్థలు కంబల పోటీల నిర్వహణకు ముందుకొచ్చాయి.
ఇవి కూడా చదవండి
-
Suriya | మమ్ముట్టి సార్ టీంకు హ్యాట్సాఫ్.. Kaathal: The Coreపై సూర్య రియాక్షన్ ఇదే
-
CM KCR | షాద్‌నగర్ వరకు మెట్రో.. ఇక మీ భూముల ధరలు మూడింతలు : సీఎం కేసీఆర్
-
BBL 2023 | డిసెంబర్లో బిగ్‌బాష్ లీగ్ 13 సీజన్.. రెండోసారి అదే జట్టుకు కమిటైన స్మిత్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

