BBL 2023 | డిసెంబర్లో బిగ్‌బాష్ లీగ్ 13 సీజన్.. రెండోసారి అదే జట్టుకు కమిటైన స్మిత్
BBL 2023 : ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) ప్రతిష్ఠాత్మక బిగ్‌బాష్ లీగ్ 13వ సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ స్టార్ ప్లేయర్ ఈసారి కూడా సిడ్నీ సిక్సర్స్(Sydney Sixers) జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. 'మరోసారి సిడ్నీ సిక్సర్స్ జెర్సీ వేసుకోబోతున్నందుకు...
BBL 2023 : ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) ప్రతిష్ఠాత్మక బిగ్‌బాష్ లీగ్ 13వ సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ స్టార్ ప్లేయర్ ఈసారి కూడా సిడ్నీ సిక్సర్స్(Sydney Sixers) జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. ‘మరోసారి సిడ్నీ సిక్సర్స్ జెర్సీ వేసుకోబోతున్నందుకు చాలా గొప్పగా అనిపిస్తోంది. సిక్సర్స్‌తో ఆడిన రోజుల్లో ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి. నిరుడు ఫైనల్‌తో కలిపి ఐదు లేదా ఆరు మ్యాచులే ఆడినా గొప్ప సంతృప్తి అనిపించింది’ అని స్మిత్ తెలిపాడు.
బీబీఎల్ 13వ సీజన్ డిసెంబర్ 7న మొదలై జనవరి 24న ముగియనుంది. నిరుడు టీ20 వరల్డ్ కప్‌లో విఫలమైన స్మిత్ బిగ్‌బాష్ లీగ్‌లో దంచికొట్టాడు. కేవలం ఐదు ఇన్నింగ్స్‌ల్లోనే రెండు సూపర్ సెంచరీతో కలిపి 346 పరుగులు సాధించాడు. దాంతో, ఈ టోర్నీలో సిడ్నీ సిక్సర్ తరఫున సెంచరీ బాదిన తొలి క్రికెటర్‌గా స్మిత్ రికార్డు నెలకొల్పాడు.
స్టీవ్ స్మిత్

బీబీఎల్ 13వ ఎడిషన్‌లో స్మిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగే చాన్స్ ఉంది. ప్రస్తుతం భారత్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో ఈ స్టార్ బ్యాటర్ మాథ్యూ షార్ట్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తున్నాడు. సిడ్నీ సిక్సర్స్ మేనేజ్మెంట్, అభిమానులకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే..? టోర్నీ మధ్యలోనే స్మిత్ పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ కోసం జట్టుతో కలువనున్నాడు. బీబీఎల్ 13వ సీజన్ తొలి మ్యాచ్‌లో సిడ్నీ డిసెంబర్ 8న మెల్బోర్న్ రెనెగ్రేడ్స్తో తలపడనుంది. ఆ తర్వాత వారం లోపే (డిసెంబర్ 14న) పాక్‌తో ఆసీస్ టెస్టు సిరీస్ షురూ కానుంది.
ఇవి కూడా చదవండి
-
Shubman Gill | గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. ప్రకటించిన జట్టు
-
Anasuya Bharadwaj | కాటుక కన్నులతో కవ్విస్తున్న అనసూయ భరద్వాజ్..
-
Mumbai: బ్యాంకు ఉద్యోగికి 35 లక్షల టోకరా.. నకిలీ ఐపీఎస్ ఆఫీసర్లు అరెస్టు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

