హనుమకొండ చౌరస్తా, జనవరి 20 : కాకతీయ విశ్వవిద్యాలయ కామర్స్ విభాగ పరిశోధక విద్యార్థిని ఎం కృష్ణవేణి.. మార్చి 28 నుంచి 30 వరకు కాంబోడియాలో జరిగే తొలి ఏషియన్ పారా త్రోబాల్ టోర్నీకి ఎంపికైంది.
ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ దివ్యాంగుల విభాగం సెల్ సంచాలకుడు డాక్టర్ ఏ రాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పారా త్రోబాల్ టోర్నీలో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించబోతున్న కృష్ణవేణిని యూనివర్సిటీ వీసీ కే ప్రతాపరెడ్డి, రిజిస్ట్రార్ మల్లారెడ్డి అభినందించారు.