Kagiso Rabada : భారత పర్యటన ఆరంభ పోరులోనే దక్షిణాఫ్రికాకు పెద్ద షాక్ తగిలింది. ట్రైనింగ్ సెషన్లో గాయపడిన ప్రధాన పేసర్ కగిసో రబడ (Kagiso Rabada) తొలి టెస్టుకు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో అందుబాటులో లేని స్పీడ్‌స్టర్ రెండో మ్యాచ్‌లోనూ ఆడడం సందేహమే అనిపిస్తోంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రబడ కోలుకునేందుకు సమయం పట్టనుంది. దాంతో.. గువాహటి మ్యాచ్‌లోపు ఈ పేస్ గన్ ఫిట్నెస్ సాధించాలని సఫారీ టీమ్ గట్టిగా కోరుకుంటోంది.
ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మొదటి టెస్టుకు దూరమైన రబడ ఆరోగ్యం గురించి టీమ్ మేనేజర్ మాట్లాడాడు. ‘మంగళవారం తొలి శిక్షణ శిబిరంలో రబడ గాయపడ్డాడు. బుధవారం ఉదయం అతడికి స్కానింగ్ పరీక్షలు జరిపాం. గురువారం రబడకు ఫిట్నెస్ టెస్టు జరిపాం. కానీ, అతడు సౌకర్యంగా కనిపించలేదు. కాబట్టే మొదటి టెస్టుకు అతడిని తీసుకోలేదు. ప్రస్తుతం రబడను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. మా జట్టుకు ప్రధాన అస్త్రమైన అతడు రెండో టెస్టులోపు కోలుకుంటాడని ఆశిస్తున్నా’ అని సఫారీ టీమ్ మేనేజర్ వెల్లడించాడు.
Big blow for the Proteas! 🇿🇦👀
Their star pacer Kagiso Rabada misses the first Test due to injury, and Dewald Brevis has been dropped from the XI! 🏏#INDvSA #Tests #Kolkata #Sportskeeda pic.twitter.com/bt2rMEuuUY
— Sportskeeda (@Sportskeeda) November 14, 2025
సొంతగడ్డపై మరో టెస్టు సిరీస్‌పై గురిపెట్టిన జట్టు ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈడెన్ గార్డెన్స్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేత దక్షిణాఫ్రికా (South Africa)ను టీమిండియా వణికించింది. తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా(35-27) నిప్పులు చెరగడంతో సఫారీలను 159కే ఆలౌట్ చేసిన భారత్ తొలి రోజు పైచేయి సాధించింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన గిల్ సేన వికెట్ కోల్పోయి 37 రన్స్ చేసింది. ఆట ముగిసే సరికి ఓపెనర్ కేఎల్ రాహుల్(13 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(6 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు.
Stumps on Day 1!
An entertaining day of Test cricket comes to an end 🙌
KL Rahul and Washington Sundar will resume proceedings tomorrow as #TeamIndia trail by 1⃣2⃣2⃣ runs.
Scorecard ▶️ https://t.co/okTBo3qxVH#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/0eqZo73x9J
— BCCI (@BCCI) November 14, 2025