Kabaddi Player Shot Dead : జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న కబడ్డీ క్రీడాకారుడు కాల్పుల్లో మరణించాడు. ఛండీగఢ్‌లోని లూధియానాలో ఈ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. మృతుడిని తేజ్‌పాల్ సింగ్ (Tejpal Singh) అనే 26 ఏళ్ల కబడ్డీ ప్లేయర్‌గా గుర్తించారు పోలీసులు. స్నేహితులే అతడిని బలిగొనడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఛాతీలోకి బుల్లెట్ దిగిన తేజ్పాల్ను ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు.
అసలేం జరిగిందంటే.. జగ్రాన్ ప్రాంతంలో ఇద్దరు స్నేహితులతో కలిసి ఫ్యాక్టరీకి నడుచుకుంటూ వెళ్తున్నాడు. మార్గం మధ్యలో వాళ్లు అతడితో గొడవకు దిగారు. గొడవ తీవ్రం కావడంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఆ సమయంలోనే తేజ్‌పాల్ స్నేహితులకు సంబంధించిన ఒక వ్యక్తి వారితో కలిశాడు. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో అతడు తేజ్‌పాల్ ఛాతిలో కాల్చాడు. అయితే.. రక్తమోడుతున్న అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ, మార్గంమధ్యలోనే తేజ్‌పాల్ చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు షూటర్‌ను పట్టుకునేందుకు బృందాలుగా గాలిస్తున్నారు.
Punjab’s youth fall victim to bullets as government watches helplessly. The brutal killing of a 27-year-old kabaddi player Tejpal in Jagraon is proof that criminals roam free while law and order has collapsed.
Families are living in fear, criminals are emboldened. Punjab needs… pic.twitter.com/tZm2gftIyx
— Pargat Singh (@PargatSOfficial) October 31, 2025