INDA vs SAA : అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత ‘ఏ’ జట్టు జోరు చూపిస్తోంది. తొలి మ్యాచ్‌లో భారీ విజయంతో ఆధిక్యంలో ఉన్న టీమిండియా రెండో మ్యాచ్‌లోనూ పట్టుబిగించింది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(127 నాటౌట్) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో రెచ్చిపోగా.. కెప్టెన్ రిషభ్ పంత్(65 నాటౌట్) మెరుపు అర్ధ శతకంతో భారీ ఆధిక్యం సాధించింది టీమిండియా. రెండో ఇన్నింగ్స్‌ను 382-7వద్ద డిక్లేర్ చేసిన భారత్ విజయంపై ధీమాతో ఉండగా.. ఆట ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 25 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా ఏ. చివరిదైన నాలుగో రోజు ప్రత్యర్థి బ్యాటర్లను చుట్టేస్తే పంత్ సేన సిరీస్ పట్టేయడం పక్కా.
తొలి అనధికారిక టెస్టులో దక్షిణాఫ్రికా ఏకు షాకిచ్చిన భారత ఏ జట్టు రెండో మ్యాచ్‌ను గుప్పిట్లోకి తెచ్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ధ్రువ్ జురెల్ (132 నాటౌట్) సెంచరీతో కోలుకున్న టీమిండియా.. బౌలర్ల విజృంభణతో సఫారీలను 221కే కట్టడి చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్ విఫలమైనా.. ‘నేనున్నా’గా అంటూ జురెల్ విధ్వంసక శతకంతో జట్టును మళ్లీ ఆదుకున్నాడు. 17 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడిన పంత్.. హర్ష్ దూబే(84) వికెట్ పడ్డాక బ్యాటింగ్ వచ్చి దంచేశాడు.
Dhruv Jurel goes back-to-back with unbeaten hundreds against South Africa A 👏
1st inns: 132*
2nd inns: 127* pic.twitter.com/p7W5uBqmB8— ESPNcricinfo (@ESPNcricinfo) November 8, 2025
జురెల్‌తో కలిసి స్కోర్‌బోర్డును ఉరికించిన పంత్.. సిక్సర్‌తో అర్ధ శతకం సాధించాడు. అప్పటికే ఆధిక్యం 400 మార్క్ దాటింది. టైమింగ్ కుదరక పంత్ వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. దాంతో.. 382-7 వద్ద భారత ఏ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 416 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన సఫారీ ఏ టీమ్.. ఆట ముగిసే సరికి 25 పరుగులు చేసింది. ఓపెనర్లు జొర్డాన్ హెర్మన్(15 నాటౌట్), లెసెగో సెనొక్వెనె(9 నాటౌట్)లు అజేయంగా రోజును ముగించారు. తొలి ఇన్నింగ్స్‌లో నిప్పులు చెరిగిన ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, సిరాజ్‌లు మళ్లీ రాణిస్తే.. సఫారీ బ్యాటర్లకు కష్టాలు తప్పవు.