బెంగళూరు: దక్షిణాఫ్రికా ‘ఏ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. భారత్ నిర్దేశించిన 417 పరుగుల భారీ లక్ష్యఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సరికి సఫారీలు వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. అంతకుముం దు ఓవర్‌నైట్ స్కోరు 78/3తో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన టీమ్ఇండియా 382/7 వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు రాహుల్(27), కుల్దీప్(16) నిరాశపర్చగా, జురెల్(170 బంతుల్లో 127నాటౌట్, 15ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టిన జురెల్ అదే దూకుడు కొనసాగిస్తూ మరో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు.