అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు(India vs West Indies)లో.. భారతీయ బ్యాటర్లు జురెల్, జడేజాలు నిలకడగా ఆడుతున్నారు. ఆ ఇద్దరూ రెండో రోజు హాఫ్ సెంచరీలు చేశారు. టెస్టుల్లో జడేజా 28వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం టీ విరామం తర్వాత భారత్ తన ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం జురెల్ 74, జడేజా 53 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఆ ఇద్దరూ అయిదో వికెట్‌కు 117 రన్స్ జోడించారు. అంతకముందు ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీ చేసి ఔటయ్యాడు. టెస్టుల్లో అతనికి 11వ సెంచరీ కావడం విశేషం. తాజా సమాచారం ప్రకారం ఇండియా 100 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 335 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే 173 రన్స్ ఆధిక్యాన్ని సాధించింది. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.
It’s another Ravindra Jadeja special ⚔
Solid knock from the #TeamIndia vice-captain so far 👏#INDvWI | @IDFCFIRSTBank | @imjadeja pic.twitter.com/f2xDnjrq1t
— BCCI (@BCCI) October 3, 2025