ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ అర్ధశతకం సాధించాడు. ఆరంభం నుంచి రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన బట్లర్ 4ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో 39 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మరో బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ కూడా చెలరేగుతున్నాడు. చెత్త బంతులతో అలవోకగా బౌండరీలు బాదుతున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం ఇప్పటికే 94 పరుగులకు చేరింది.
అంతకుముందు సందీప్ శర్మ బౌలింగ్‌లో శాంసన్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వ్యక్తిగత స్కోరు 23 వద్ద సందీప్ వేసిన స్లో బాల్‌ను భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా లాంగాన్‌లో మనీశ్ పాండే క్యాచ్ వదిలేయడంతో బతికిపోయాడు. 13 ఓవర్లకు రాజస్థాన్ వికెట్ నష్టానికి 111 పరుగులు చేసింది. బట్లర్(57), శాంసన్(33) క్రీజులో ఉన్నారు.
Dropped!
— IndianPremierLeague (@IPL) May 2, 2021
Samson strikes straight down the throat of Manish Pandey at long-off who spills a sitter! Sandeep Sharma misses out on a wicket. #RR are 86-1 after 11 overs.https://t.co/7vPWWkMqQ2 #RRvSRH #VIVOIPL pic.twitter.com/cH99ZMwM7n