అహ్మాదాబాద్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న వరల్డ్‌కప్ వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ వరుసగా వికెట్లను కోల్పోతున్నది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(Joe Root) ఒక్కడే రాణించాడు. వన్డేల్లో అతను 37వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిగితా ఇంగ్లండ్ బ్యాటర్లు మంచి స్టార్ట్ తీసుకున్నా.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. అయితే కివీస్ బౌలర్లు క్రమక్రమంగా వికెట్లను పడగొట్టారు. బెయిర్‌స్టో 33, మలన్ 14, బ్రూక్ 25, అలీ 11, బట్లర్ 43, లివింగ్‌స్టోన్ 20 రన్స్ చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు. రూట్ 77 రన్స్ చేసి నిష్క్రమించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 41.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 229 రన్స్ చేసింది.