హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్(టీవోఏ)లో కొత్త కార్యవర్గం కొలువుదీరింది. బుధవారం ఎల్బీ స్టేడియం ఎల్వీఆర్ భవనం వేదికగా జరిగిన ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ జరిగింది. టీవోఏ నూతన అధ్యక్షుడిగా, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి 34 ఓట్ల తేడాతో సమీప అభ్యర్థి చాముండేశ్వర్నాథ్పై ఘన విజయం సాధించాడు.
పలు క్రీడా సంఘాల మద్దతుతో జితేందర్‌రెడ్డికి 43 ఓట్లు రాగా, చాముండేశ్వర్‌నాథ్‌కు 9 ఓట్లు పోల్ అయ్యాయి. ప్రధాన కార్యదర్శిగా మల్లారెడ్డికి 40 ఓట్లు, ప్రత్యర్థి బాబురావు సాగర్‌కు 12 ఓట్లు వచ్చాయి. కోశాధికారిగా ప్రవీణ్సాగర్(12)పై సతీశ్‌గౌడ్(40) విజయం సాధించాడు.