INDW VS AUSW : ఆసీస్ నిర్దేశించిన 339 పరుగుల ఛేదనలో ఓపెనర్లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగినా మిడిలార్డర్ బ్యాటర్లు గొప్పగా ఆడుతున్నారు. మూడో స్థానంలో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్(61 నాటౌట్) కట్ షాట్లతో బౌండరీలు రాబడుతూ అదరగొడుతోంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(38 నాటౌట్)తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న రోడ్రిగ్స్.. వరుసగా రెండో అర్ధ శతకం బాదింది. అలనా కింగ్ ఓవర్లో బౌండరీతో తను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 86 రన్స్ జోడించారు. దాంతో.. 24 ఓవర్లకు భారత్ 2 వికెట్ల నష్టానికి145 పరుగులు చేసింది.
భారీ ఛేదనలో దంచేస్తారనుకుంటే భారత ఓపెనర్లు పవర్ ప్లేలోనే డగౌట్ చేరారు. రెండో ఓవర్లోనే షఫాలీ వర్మ(10) ఎల్బీగా ఔట్ కాగా.. సూపర్ ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన(24) అనూహ్యంగా వెనుదిరిగింది. కిమ్ గార్త్ వేసిన 10వ ఓవర్ రెండో బంతికి తను వికెట్ కీపర్ అలీసా చేతికి చిక్కింది.
Stepping up to the challenge 💪
🔙 to 🔙 fifties for Jemimah Rodrigues 👏
She also brings a crucial 5️⃣0️⃣-run stand up with captain Harmanpreet Kaur 🙌
Updates ▶ https://t.co/ou9H5gN60l#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvAUS | @JemiRodrigues | @ImHarmanpreet pic.twitter.com/fNPogiUbUj
— BCCI Women (@BCCIWomen) October 30, 2025
అంపైర్ ఆ బంతిని వైడ్ ఇవ్వగా రివ్యూ తీసుకుంది ఆసీస్ కెప్టెన్. అయితే.. అల్ట్రా ఎడ్జ్‌లో స్పైక్స్ కనిపించగా.. మంధాన నిరాశగా పెవిలియన్ చేరింది. దాంతో రెండో వికెట్ 46 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. పవర్ ప్లేలో రెండు వికెట్లు పడిన వేళ జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్న జెమీమా రోడ్రిగ్స్(61 నాటౌట్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(38 నాటౌట్)లు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.