చెమ్స్‌ఫోర్డ్ : జెమీమా రోడ్రిగ్స్ (69), యాస్తిక భాటియా (54) అద్భుత హాఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను భారత అమ్మాయిల జట్టు విజయంతో ఆరంభించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత్ 38 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 188/7 స్కోరుచేసింది. స్టాండిన్ కెప్టెన్ స్మృతి మంధాన (0) డకౌటవ్వగా.. మరో ఓపెనర్ షఫాలీ వర్మ (2) కూడా నిరాశపరిచింది.
ఈ దశలో జెమీమా, భాటియా కౌంటర్ ఎటాక్‌కు దిగి మూడో వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.చివర్లో దీప్తి శర్మ (22 నాటౌట్) వేగంగా ఆడింది. అనంతరం భారీ ఛేదనలో ఇంగ్లండ్ ఓవర్లన్నీ ఆడి 150/8 స్కోరు మాత్రమే చేసి ఓడిపోయింది. ఎమీ జోన్స్ (67) ఒంటరి పోరాటం చేసింది. భారత అరంగేట్రం పేసర్ నందిని శర్మ (3/34) ఆ జట్టును దెబ్బకొట్టగా.. క్రాంతి గౌడ్ రెండు వికెట్లు పడగొట్టింది. జెమీమాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శనివారం జరుగుతుంది.