Jayden Seales : వెస్టిండీస్ పేసర్ జైడెన్ సీల్స్ (Jayden Seales)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి షాకిచ్చింది. భారత్‌తో జరుగుతున్న ఢిల్లీ టెస్టులో ఐసీసీ నియమావళిని ఉల్లంఘించనందుకు మ్యాచ్ ఫీజులో కోత విధించింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) వైపు అతడు బంతిని వేగంగా విసరడమే అందుకు కారణం. సీల్స్ చర్యను తప్పుపట్టిన రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఐసీసీకి ఫిర్యాదు చేశాడు.
భారత ఇన్నింగ్స్ 29వ ఓవర్లో రన్ తీస్తున్న యశస్వీ వైపు సీల్స్ బంతిని వేగంగా విసిరాడు. అది యశస్వీ ప్యాడ్లను తాకింది. దాంతో.. సీల్స్ ఆర్టికల్ 2.9 నిబంధనను ఉల్లంఘించాడని రిఫరీ క్రాఫ్ట్ ఐసీసీకి నివేదించాడు. మ్యాచ్ ముగిశాక విచారణలో విండీస్ పేసర్ తాను రనౌట్‌కు మాత్రమే ప్రయత్నించానని సంజాయిషీ ఇచ్చాడు. కానీ, అందుకు ఆస్కారమే లేదని, ఉద్దేశపూర్వకంగానే అతడు యశస్వీ లక్ష్యంగా బంతిని విసిరాడని రిఫరీ క్రాఫ్ట్ తెలిపాడు.
🚨JAYDEN SEALES FINED🚨
For throwing a ball back at Yashasvi Jaiswal during India’s innings on Day 1, the ICC has fined Jayden Seales.
The pacer contested that he was attempting a run out but the match referee concluded that the throw was unnecessary and inappropriate #INDvWI pic.twitter.com/bv5dpXZKGM
— Cricbuzz (@cricbuzz) October 12, 2025
ఐసీసీ నియమావళి ప్రకారం ఆటగాళ్లకు హాని కలిగేలా ప్రవర్తించడం, క్రీడా వస్తువులను విరగొట్టడం, దెబ్బతినేలా చేయడం వంటి వాటిని నేరంగా పరిగణిస్తారు. అందుకే.. తప్పిదానికి పాల్పడినందున సీల్స్కు మ్యాచ్ ఫీజులో 24 శాతం కోత విధించారు. అంతేకాదు నిరుడు డిసెంబర్లో బంగ్లాదేశ్‌పై కూడా కోడ్ అతిక్రమించినందును.. ఈసారి పొరపాటుతో కలిపి స్పీడ్‌స్టర్‌కు రెండు డీమెరిట్ పాయింట్లు కేటాయించారు.
ఢిల్లీ టెస్టులో ఓటమి తప్పించుకునేందుకు వెస్టిండీస్ పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ విజృంభణకు చేతులెత్తేసిన విండీస్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఓపెనర్ తగ్‌నరైన్ చందర్‌పాల్ (10) మరోసారి నిరాశపరచగా.. జాన్ క్యాంప్‌బెల్ (87 నాటౌట్) అర్ధ శతకంతో రాణించాడు. అతడికి షాయ్ హోప్ (66 నాటౌట్)తోడవ్వగా వీరిద్దరూ అజేయంగా 138 రన్స్ జోడించారు. దాంతో.. ఆట ముగిసే సిరికి విండీస్ 2 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అయినా ఇంకా 97 పరుగులు వెనుకంజలోనే ఉంది పర్యాటక జట్టు.
That’s stumps on Day 3️⃣!
A wicket each for Mohd. Siraj and Washington Sundar 👍
West Indies trail #TeamIndia by 9️⃣7️⃣ runs (f/o)
Scorecard ▶️ https://t.co/GYLslRzj4G#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/UVnrWKJ3Zb
— BCCI (@BCCI) October 12, 2025