Jasprit Bumrah : భారత జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మరో మైలురాయికి చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌పై నాలుగు వికెట్లతో చెలరేగిన ఈ స్పీడ్‌స్టర్ అంతర్జాతీయంగా 400 వికెట్ల క్లబ్లో చేరాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన ఆరో భారత పేసర్‌గా, మొత్తంగా పదో బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలర్‌గా ఎదిగిన ఈ యార్కర్ కింగ్ 227 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. అతడు 21.01 సగుటతో 401 వికెట్లు పడగొట్టాడు.
బుమ్రా కంటే ముందు పేసర్లు కపిల్ దేవ్, జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీలు నాలుగ్గొందల క్లబ్లో చేరారు. ప్రస్తుతం భారత్ తరఫున అత్యధిక వికెట్ల వీరుడు ఎవరంటే.. అనిల్ కుంబ్లే. లెజెండరీ స్పిన్నర్ అయిన కుంబ్లే మూడు పార్మాట్లలో 953 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. చెపాక్ టెస్టులో శతకంతో మెరిసిన అశ్విన్ 744 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
𝟒𝟎𝟎 𝐰𝐢𝐜𝐤𝐞𝐭𝐬 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚 💥💥
A milestone to savour! @Jaspritbumrah93 has picked up his 400th wicket for #TeamIndia.
Hasan Mahmud is caught in the slips and Bangladesh are now 112-8.#INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/HwzUaAMOBt
— BCCI (@BCCI) September 20, 2024
1. అనిల్ కుంబ్లే – 953 వికెట్లు, 499 ఇన్నింగ్స్‌లు.
2. అశ్విన్ – 744 వికెట్లు, 369 ఇన్నింగ్స్‌లు.
3. హర్భజన్ సింగ్ – 707 వికెట్లు, 442 ఇన్నింగ్స్‌లు.
4. కపిల్ దేవ్ – 687 వికెట్లు, 448 ఇన్నింగ్స్‌లు.
5. జహీర్ ఖాన్ – 597 వికెట్లు, 373 ఇన్నింగ్స్‌లు.
6. రవీంద్ర జడేజా – 570 వికెట్లు, 397 ఇన్నింగ్స్‌లు.
7. జవగల్ శ్రీనాథ్ – 551 వికెట్లు, 348 ఇన్నింగ్స్‌లు.
8. మహహ్మద్ షమీ – 448 వికెట్లు, 188 మ్యాచ్‌లు.
9. ఇషాంత్ శర్మ – 434 వికెట్లు, 280 ఇన్నింగ్స్‌లు.
10. జస్ప్రీత్ బుమ్రా – 401 వికెట్లు, 227 ఇన్నింగ్స్‌లు.
బుమ్రాకు సహచరుల అభినందన
చెపాక్ టెస్టు బుమ్రాకు 196వ అంతర్జాతీయ మ్యాచ్. రెండో రోజు తొలి సెషన్లో తన పేస్ పవర్ చూపించిన బుమ్రా బంగ్లా బ్యాటర్లను వణికించాడు. నాలుగు కీలక వికెట్లతో చెలరేగి భారత్‌కు భారీ ఆధిక్యం అందించాడు. అంతర్జాతీయ కెరీర్ చూసుకుంటే.. 37 టెస్టులు ఆడిన బుమబ్రా 163 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
పదిసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన అతడు 6/27తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఇక 89 వన్డేల్లో బుమ్రా 149 వికెట్లు తీశాడు. అత్యుత్తమ ప్రదర్శన 6/19. పొట్టి ఫార్మాట్లో విజయవంతమైన బుమ్రా 70 మ్యాచుల్లో 89 వికెట్లు పడగొట్టాడు. బెస్ట్ ఫిగర్స్.. 3/7.