Fine for Defacation | సింగపూర్‌లో భారతీయుడికి భారీ జరిమానా.. ఓ స్టోర్ గేటు ముందు ఆ పని చేసినందుకట..?
Fine for Defacation | సింగపూర్‌లో ఓ భారతీయ నిర్మాణరంగ కార్మికుడికి అక్కడి కోర్టు భారీ జరిమానా విధించింది. మద్యం మత్తులో తాను ఆ తప్పు చేశానని నిందితుడు అంగీకరించడంతో అతడికి రూ.25 వేల ఫైన్ వేసింది.
Fine for Defacation : సింగపూర్‌లో ఓ భారతీయ నిర్మాణరంగ కార్మికుడికి అక్కడి కోర్టు భారీ జరిమానా విధించింది. మద్యం మత్తులో తాను ఆ తప్పు చేశానని నిందితుడు అంగీకరించడంతో అతడికి రూ.25 వేల ఫైన్ వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సింగపూర్‌లో గత ఏడాది అక్టోబర్ 30న రాత్రి రాము అనే భారత పౌరుడు పూటుగా మద్యం సేవించాడు. ఆ రాత్రంతా మెరీనా బే శాండ్స్ కెసినోలో గడిపాడు.
తెల్లవారుజామున 5 గంటలకు కెసినో నుంచి బయటకు వచ్చిన అతను కాలకృత్యాలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే మద్యం మత్తులో మరుగుదొడ్డి ఎక్కడ ఉందో గుర్తించలేకపోయాడు. చివరకు ఉదయం 7 గంటల సమయంలో అదే ఏరియాలోని ‘ది షాపీస్’ అనే స్టోర్ ఎంట్రన్స్ వద్ద మల విసర్జన చేశాడు. దాంతో ఈ ఘటనపై విచారణ జరిపిన సింగపూర్ కోర్టు నిందితుడికి భారీ జరిమానా విధించింది.
రాము బహిరంగ ప్రదేశంలో మల విసర్జన చేశాడని కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించాడు. తన పని ముగించుకున్నాక అక్కడి నుంచి క్రాంజీలోని తన నివాసానికి వెళ్లాడని తెలిపారు. ఆ తర్వాత సింగపూర్ నుంచి భారత్‌కు వచ్చిన అతడు మళ్లీ జూన్ 4న వెళ్లాడు. మరోసారి అతడు కెసీనోలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా సిబ్బంది గుర్తుపట్టారు. అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనపై విచారణ సందర్భంగా.. నిందితుడికి గరిష్ఠ జరిమానా విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. అతడు దాదాపు 10 నిమిషాల పాటు బయటే ఉన్నాడని, ఇది సాధారణ విషయం కాదని అన్నాడు. నిందితుడు మాత్రం తాను మద్యం మత్తులో తప్పు చేశానని, స్వల్ప జరిమానా విధించాలని కోరాడు. దీనిపై న్యాయమూర్తి ఘాటుగా స్పందించారు. ‘ఇలాంటి తప్పు పునరావృతమైతే జరిమానా మరింత ఎక్కువ ఉంటుందన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు’ అని నిందితుడికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

