బెంగళూరు: బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టు (Bengaluru Test) చివరిరోజు ఆట ప్రారంభమైంది. మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం సాధించిన న్యూజిలాండ్‌ను అడ్డుకునేందుకు భారత బౌలర్లు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆట ప్రారంభమైన తొలి ఓవర్లోనే కివీస్ బ్యాట్స్‌మెన్ టామ్ లాథమ్‌ను బుమ్రా బురిడీ కొట్టించాడు. రెండో బంతికే అతడిని వికెట్ల ముందు దొరకబట్టాడు. దీంతో ఖాతా తెరవకుండానే న్యూజిలాండ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం కాన్వే, విల్ యంగ్ క్రీజ్‌లో ఉన్నారు.
సర్ఫ్రాజ్ ఖాన్, రిషబ్ పంత్ పోరాటంతో టీమిండియా 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్ ముందు ఉంచిన విషయం తెలిసిందే. అద్భుతం జరిగితే తప్పా ఈ మ్యాచ్‌ను భారత్ నిలుపుకోవడం కష్టంగా మారింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ కొట్టేందుకు న్యూజిలాండ్ చేరువలో ఉన్నది.