న్యూఢిల్లీ:ముంబైతో జరిగిన ఐపీఎల్(IPL 2025) మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్ కరుణ్ నాయర్ చెలరేగి ఆడాడు. ఆ మ్యాచ్‌లో డీసీ ఓడినా.. నాయర్ మాత్రం తన స్ట్రోక్ ప్లేతో ఆకట్టుకున్నాడు. అతను క్రీజ్‌లో ఉన్నంత సేపు.. ఇక ఆ జట్టు గెలుస్తుందేమో అన్న టెన్షన్ పుట్టించాడు. అయితే కరుణ్ నాయర్ జోరుమీదున్న సమయంలో.. పిచ్‌పై ఓ సంఘటన జరిగింది. బుమ్రా బౌలింగ్‌లో రెండో రన్ కోసం ప్రయత్నించిన కరుణ్.. బంతిని చూస్తూనే పరుగు తీశాడు. ఆ క్రమంలో బుమ్రాను ఢీకొట్టాడు. అయితే ఆ ఘటన పట్ల ముంబై బౌలర్ బుమ్రా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. నాయర్ కావాలనే తనను ఢీకొట్టినట్లు వాదించాడు.
జరిగిన సంఘటన పట్ల కరుణ్ క్షమాపణలు చెప్పినా.. బుమ్రా మాత్రం తన కోపాన్ని తగ్గించుకోలేదు. ఇది అనుకోకుండా జరిగినట్లు ముంబై కెప్టెన్ హార్దిక్‌కు కరుణ్ చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఆ టైంలో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ ఓ వెరైటీ రియాక్షన్ ఇచ్చాడు. కరుణ్ వైపు చూస్తూ రోహిత్ టీజింగ్ చేశాడు. నవ్వుతూ తన తలను ఊపాడు. రోహిత్ ఇచ్చిన ఆ రియాక్షన్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది. ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై 12 రన్స్ తేడాతో ఢిల్లీపై నెగ్గింది.
The average Delhi vs Mumbai debate in comments section 🫣
Don’t miss @ImRo45 ‘s reaction at the end 😁
Watch the LIVE action ➡ https://t.co/QAuja88phU#IPLonJioStar 👉 #DCvMI | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/FPt0XeYaqS
— Star Sports (@StarSportsIndia) April 13, 2025