Jasprit Bumrah : భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) త్వరలోనే జట్టులోకి రానున్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు ప్రయత్నిస్తున్న అతను ఐర్లాండ్ సిరీస్(Ireland Series)తో మైదానంలోకి దిగనున్నాడు. వెన్నెముక గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ యార్కర్ స్పెషలిస్టు.. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(NCA)లో ఉన్నాడు. నిపుణులైన శిక్షకుల మధ్య ఫిట్నెస్తో పాటు గాయం నుంచి కోలుకునేందుకు వంద శాతం ప్రయత్నిస్తున్నాడు. నిజానికి ఆసియా కప్(Asia Cup 2023) టోర్నమెంట్ సమయానికి జట్టులోకి వస్తాడనుకున్న బుమ్రా వేగంగా కోలుకుంటున్నాడు.
ప్రతి రోజు ఎన్సీఏలో ఎనిమిది నుంచి 10 ఓవర్ల పాటు బౌలింగ్ చేస్తున్న ఈ ముంబైకర్.. ఐర్లాండ్ టూర్లో భారత జట్టుతో కలిసే అవకాశముంది. రానున్న మేజర్ టోర్నీలను దృష్టిలో పెట్టుకుని ఐర్లాండ్ పర్యటనకు ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లు బుమ్రాకు అవకాశం ఇవ్వనున్నారు.
జస్ప్రీత్ బుమ్రా
గాయం కారణంగా గత ఏడాది సెప్టెంబర్ నుంచి జట్టుకు దూరమైన బుమ్రా..ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌తో పాటు పలు టోర్నీల్లో ఆడలేదు. స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో బుమ్రా కీలకం కానున్న నేపథ్యంలో అతడు త్వరలోనే జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ(prasidh krishna) కూడా ఎన్సీఏలో ఫిట్నెస్ మెరుగు పరుచుకుంటున్నాడు.
ప్రసిద్ధ్ కృష్ణ
ఐపీఎల్ 16వ సీజన్‌కు పూర్తిగా దూరమైన ఈ స్పీడ్‌స్టర్ వన్డే ప్రపంచకప్ టోర్నీకి ఎంపికైతే భారత్‌కు అనుకూలించే అవకాశముంది. సెకండ్ పవర్‌ప్లేలో ప్రత్యర్థి బ్యాటర్లను తన స్వింగ్‌తో కట్టడి చేయడంలో కృష్ణ ఉపయోగనున్నాడు. బుమ్రాతో పాటు కృష్ణ జట్టులోకి వస్తే భారత బౌలింగ్‌కు అదనపు బలం చేకూరే అవకాశముంది.