Lionel Messi | ఇంటర్ మియామి క్లబ్ నుంచి అపూర్వ స్వాగతం.. ఎమోషనల్ అయిన మెస్సీ
Lionel Messi : వరల్డ్ కప్ హీరో లియోనల్ మెస్సీ(Lionel Messi)కి కొత్త క్లబ్ ఇంటర్ మియామి(Inter Miami) నుంచి అపూర్వ స్వాగతం లభించింది. వేలాదిమంది అభిమానులు ఈ స్టార్ ఫుట్‌బాలర్‌ను చూసేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా పదో నంబర్ ఉన్న మెస్సీ జెర్సీ విడుదల చేశారు. ఇంటర్ మియామి క్లబ్ అధ్యక్షుడు, సహ యజమాని డేవిడ్ బెక్‌హమ్(David Beckham) మెస్సీకి...
Lionel Messi : వరల్డ్ కప్ హీరో లియోనల్ మెస్సీ(Lionel Messi)కి కొత్త క్లబ్ ఇంటర్ మియామి(Inter Miami) నుంచి అపూర్వ స్వాగతం లభించింది. వేలాదిమంది అభిమానులు ఈ స్టార్ ఫుట్‌బాలర్‌ను చూసేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా పదో నంబర్ ఉన్న మెస్సీ జెర్సీ విడుదల చేశారు. ఇంటర్ మియామి క్లబ్ అధ్యక్షుడు, సహ యజమాని డేవిడ్ బెక్‌హమ్(David Beckham) మెస్సీకి పదో నెంబర్ జెర్సీ అందించాడు.
దాంతో, మెస్సీ ఎమోషనల్ అయ్యాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. గతంలో పీఎస్జీ(PSG) క్లబ్‌కు ఆడిన మెస్సీ ఈమధ్యే ఇంటర్ మియామితో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్డేల్(Fort Lauderdale) ఉన్న ఓ స్టేడియంలో నిన్న రాత్రి మెస్సీ జెర్సీ ఆవిష్కరణ జరిగింది.
ఓవైపు వర్షం కురుస్తున్నా కూడా వేలాది మంది అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వాళ్లు తనపై చూపించిన ప్రేమకు మెస్సీ పొంగిపోయాడు. ‘నాకు అపూర్వ స్వాగతం పలికిన మియామి ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు. నిన్న రాత్రి వర్షంలోనూ మీరంతా నా కోసం వేచి చూశారు. మీ ప్రేమకు, అభిమానానికి థ్యాంక్యూ. అంతేకాదు ఆర్టిస్టులు చాలా అద్భుతంగా పాటలు పాడారు. మీ అందర్నీ మళ్లీ శుక్రవారం కలుస్తాను’ అని మెస్సీ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
లియోనల్ మెస్సీ, డేవిడ్ బెక్‌హమ్

మేజర్ సాకర్ లీగ్(Major Soccer League)లో మెస్సీ ఇంటర్ మియామి తరఫున శుక్రవారం తొలి మ్యాచ్ ఆడనున్నాడు. నిరుడు అర్జెంటీనాకు వరల్డ్ కప్ అందించిన మెస్సీపై మియామి క్లబ్ భారీ ఆశలే పెట్టుకుంది. మరి ఈ స్టార్ ఆటగాడు ఏ మేరకు రాణిస్తాడు? అనేది ఆసక్తిగా మారింది.
ఇవి కూడా చదవండి
Emerging Asia Cup 2023 | అర్ధ శతకాలతో చెలరేగిన ఓపెనర్లు.. వరుసగా రెండో విక్టరీ కొట్టిన భారత్
Asia cup 2023 | ఈవారంలో ఆసియా కప్ షెడ్యూల్.. ఆరంభ మ్యాచ్ పాక్ గడ్డపై..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

