Jasprit Bumrah | మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీపై భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు జట్టును ఎలా ప్రభావితం చేశారు ? ఆటగాళ్ల అభివృద్ధికి ఎలా కృషి చేశారో చెప్పాడు. ఈ ముగ్గురి నాయకత్వంలో ఆడిన అతికొద్ది మంది ఆటగాళ్లు బుమ్రా సైతం ఒకొడు. ధోనీ కెప్టెన్సీలో అరంగేట్రం చేసిన బుమ్రా.. కోహ్లీ కెప్టెన్సీలో తనను తాను మెరుగుపరుచుకున్నాడు. రోహిత్ నాయకత్వంలో స్వేచ్ఛగా ఆడే అవకాశం దక్కింది. రోహిత్ కెప్టెన్సీలో బుమ్రా ముంబయి ఇండియన్స్ తరఫున సైతం ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆటగాళ్లతో భావోద్వేగ స్థాయిలో కనెక్ట్ అయ్యాడని, వారి సవాళ్లను అర్థం చేసుకుని స్వేచ్ఛగా స్పందించాడని బుమ్రా రోహిత్‌పై ప్రశంసలు కురిపించాడు. రోహిత్ కెప్టెన్సీపై ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ బౌలర్లపై సానుభూతి చూపే అతికొద్ది మంది కెప్టెన్లలో రోహిత్ ఒకడని చెప్పాడు.
2011 ప్రపంచకప్‌తో సహా అనేక చిరస్మరణీయ విజయాలను భారత్‌కు అందించిన ధోనీ కెప్టెన్సీలో తన అనుభవాలను సైతం పంచుకున్నాడు. ధోనీ తనకు చాలా భద్రతనిచ్చాడని తెలిపాడు. ఓవర్ ప్లానింగ్‌ను నమ్మడని, తాను అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన విశ్వాసాన్ని ఇచ్చాడని చెప్పారు. విరాట్ కోహ్లీ శక్తివంతుడని.. ఉద్వేగంగా, దూకుడుగా ఉంటాడని తెలిపాడు. ప్రస్తుతం కెప్టెన్ కాకపోయినా నాయకుడిగా కొనసాగుతున్నాడని చెప్పాడు. కెప్టెన్సీ ఒక పోస్ట్ మాత్రమేనని.. జట్టు 11 మందితో నడుస్తుందని చెప్పాడు. తన కెప్టెన్సీ గురించి బుమ్రా మాట్లాడుతూ.. బౌలర్లు తెలివైనవారని తాను భావిస్తున్నానని చెప్పాడు. ఎందుకంటే వారు బ్యాట్స్మెన్లను అవుట్ చేస్తారని.. మ్యాచ్‌లో ఓడిపోయినప్పుడు సాధారణంగా బ్యాట్స్‌మెన్‌పై నిందలు వేస్తారని.. కాబట్టి ఇది చాలా కష్టమైన పని అని పేర్కొన్నాడు. కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ వంటి కెప్టెన్లు సైతం బౌలర్లేనని చెప్పాడు. కపిల్ దేవ్ భారత్‌కు ప్రపంచకప్ సాధించిపెట్టాడని.. ఇమ్రాన్ ఖాన్ పాక్‌కు ప్రపంచకప్ అందించాడని.. అందుకే బౌలర్లు తెలివైనవారని చెప్పుకొచ్చాడు.