Jaspal Rana : ఒలింపిక్స్‌కు షూటర్ల ఎంపిక విధానం సరిగ్గా లేదని జస్పాల్ రానా (Jaspal Rana) ఆగ్రహం వ్యక్తం చేశాడు. పారిస్‌లో మను భాకర్ (Manu Bhaker) కంచు మోతలో కీలక పాత్ర పోషించిన రానా తాజాగా నేషనల్ రైఫిల్ అసోసియేషన్‌పై మండిపడ్డాడు. ‘ప్రతి ఆరు నెలలకు ఓసారి రైఫిల్ సమాఖ్య (NRAI) విధానాలు మారిపోతుంటాయి. దాంతో, సత్తాగల షూటర్లు ఒలింపిక్స్‌కు వెళ్లడం లేదు. అసలు ఎన్ఆర్ఎఫ్లో షూటర్లను కాపాడే, వాళ్లకు మద్దతిచ్చే వ్యవస్థ లేదు’ అని రానా తెలిపాడు.
ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణాలు గెలిచిన ఏదో ఊరికే జస్పాల్ ఏదో ఊరికే రైఫిల్ సమాఖ్యను విమర్శించడం లేదు. తగిన సాక్ష్యాలతోనే ఆయన ఎంపిక ప్రక్రియను తప్పు పడుతున్నాడు. కెరీర్ ఆరంభంలో మెరిసిన సౌరభ్ చౌదరీ, జితు రాయ్‌లు ఆ తర్వాత వెలుగులోకి రాలేదు.
జస్పాల్ రానా
ఇక అర్జున్ బబుతా విషయం కూడా అంతే. వీళ్లకు గనుక తగిన ప్రోత్సాహం లభిస్తే అద్భుతాలు చేస్తారు అని రానా వ్యాఖ్యానించాడు. నేను క్రీడా మంత్రిని కలిసి సమాఖ్య నుంచి సెలక్షన్ పాలసీని తీసుకోవాలని కోరాను. ఇక నిర్ణయించాల్సింది వాళ్లే. వాళ్ల నిర్ణయం తప్పా? ఒప్పా? అనేది ఇప్పుడు మనం చర్చించడం లేదు. వాళ్ల నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అని రానా వెల్లడించాడు.
సౌరభ్ చౌదరీ
టోక్యో ఒలింపిక్స్ వైఫల్యంతో కుంగిపోయిన మను భాకర్‌కు జస్పాల్ అండగా నిలచాడు. కఠన శిక్షణతో ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. దాంతో, మను పారిస్‌లో పతక గర్జన చేసింది. వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో కంచు మోత మోగించింది. తద్వారా ఒకే విశ్వక్రీడల్లో రెండు పతకాలు కొల్లగొట్టిన భారత తొలి షూటర్‌గా ఆమె రికార్డు నెలకొల్పింది.
తొలుత10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత పోటీల్లో మను మూడో స్థానంతో దేశానికి తొలి మెడల్ అందించింది. అనంతరం సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్సడ్ ఈవెంట్లో కాంస్యంతో మెరిసింది. ఒలింపిక్స్ కోసం సుదీర్ఘంగా శిక్షణ పొందిన మను మూడు నెలలు బ్రేక్ తీసుకోనుంది.