French Open : గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ అయిన ఫ్రెంచ్ ఓపెన్(French Open 2024)లో టాప్ సీడ్లకు అపజయమన్నదే లేకుండా పోయింది. పురుషుల సింగిల్స్‌లో జన్నిక్ సిన్నర్(Jannik Sinner), మహిళల విభాగంలో కొకో గాఫ్(Coco Gauff)లు నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత సిన్నర్ శుక్రవారం రష్యా ఆటగాడికి చెక్ పెట్టాడు.
మూడు సెట్లలో జోరు కనబరిచిన ఇటలీ స్టార్ 6-4, 6-4, 6-4తో మ్యాచ్ ముగిచాడు. ఈ ఏడాది యూఎస్(US Open) ఓపెన్‌తో చరిత్ర సృష్టించిన అమెరికా టీనేజర్ గాఫ్ అతికష్టం మీద గట్టెక్కింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి డయానా యస్త్రెమ్స్కాతో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో 6-2, 6-4తో తేడాతో గెలిచి హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంది.
70% of Earth is covered by water, the rest by Sinner 🌍#RolandGarros pic.twitter.com/jnTVRRTuM0
— Roland-Garros (@rolandgarros) May 31, 2024
మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్ ఒల్గా డానిలోవిక్(Olga Danilovic) ముందంజ వేసింది. క్రొయట్ డొన్న వెకిక్తో జరిగిన పోరులో 0-6తో తొలి సెట్ కోల్పోయిన సెర్బియా కెరటం అనూహ్యంగా పుంజుకుంది. రెండు, మూడో సెట్లో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. 0-6, 7-5, 7-6తో గెలుపొందింది. ఆఖరి పాయింట్ సాధించగానే ఒల్గా సంతోషం పట్టలేకపోయింది. భావోద్వేగానికి లోనైన ఆమె ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూనే కోచ్, ప్రేక్షకులకు అభివాదం తెలుపుతూ సంబురాలు చేసుకుంది.
The fairytale run continues 🌟
Soak it all in, Olga Danilovic 🫶#RolandGarros pic.twitter.com/govEU4YAUZ
— Roland-Garros (@rolandgarros) May 31, 2024