Amberpet SI | హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఎస్సై భానుప్రకాశ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. చోరీ కేసులో రికవరీ చేసిన సొమ్మును వాడుకున్న కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అతను రిమాండ్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్ కేసులోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
అంబర్‌పేట ఎస్ఐ భానుప్రకాశ్‌కు సంబంధించిన 9 ఎంఎం సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్ వ్యవహారం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. విజయవాడలో ఓ లాడ్జిలో తాను చదువుకునే పుస్తకాల దగ్గర పెట్టుకున్నప్పుడు అది మిస్ అయిందంటూ ఎస్ఐ చెప్పడంతో హైదరాబాద్ పోలీసులు విజయవాడలోని లాడ్జి, అందులో పనిచేసే బాయ్స్, హోటల్ యజమానిని ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలించారు. తుపాకీకి సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదు.. అసలు ఆ తుపాకీ వ్యవహారమేంటో తమకు తెలియదని లాడ్జి యాజమాన్యం చెప్పినట్లు సమాచారం. బెట్టింగ్ బాబు భాను ప్రకాశ్ తన జల్సాల కోసం తుపాకీని అమ్మేశాడంటూ ఆయన బ్యాచ్‌మేట్స్ చెప్పుకుంటున్నారు.
తాను ట్రైనింగ్ తీసుకునే సమయంలో కూడా విపరీతంగా బెట్టింగ్ ఆడేవాడని, ఆ తర్వాత తన ఇంట్లో బంగారం తీసుకొచ్చి కూడా బెట్టింగ్‌లో పెట్టాడని ఆయన సహచరులు చెప్పారు. ఏపీలో తనకు పీసీబీలో ఉద్యోగం వచ్చిన తరువాత అందులో జాయిన్ కావాలంటే ఇక్కడ ఎన్ఓసీ తీసుకోవాలని అందుకోసం ఇక్కడకు వచ్చి తన డ్రాలో చూసుకుని రివాల్వర్ కనిపించడం లేదని చెప్పడం, ఆ తర్వాత తన వెంటనే తీసుకెళ్లి తుపాకీని విజయవాడ లాడ్జి మరిచిపోయినట్లు చెప్పడం.. ఇలా పొంతన లేని మాటలతో కాలయాపన చేస్తున్నారు.. టాస్క్‌ఫోర్స్‌ను ఉరికిస్తున్నారు తప్ప అసలు రహస్యం ఇప్పటికీ భానుప్రకాశ్ నోటివెంట బయటకు రావడం లేదు. ఇప్పటికే ఆ తుపాకీ ఎన్ని చేతులు మారిందనేది ప్రస్తుతం పోలీస్‌శాఖలో చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా తుపాకీ కుదువ పెట్టి మొదట్లో ఐదు లక్షలు తెచ్చుకున్న తర్వాత మళ్లీ పైసల కోసం వెళ్తే అది అమ్మేస్తానని చెప్పడంతో ఆ తుపాకీని రాయలసీమ గ్యాంగ్స్‌కు అమ్మేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంత నిజముందో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నించినా చిన్న క్లూ కూడా దొరకడం లేదని ఓ సీనియర్ ఆఫీసర్ చెప్పారు. అసలు సర్వీస్ రివాల్వర్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అంటూ పోలీసులే మాట్లాడుకుంటున్నారు. మరోవైపు సస్పెన్షన్‌కు గురైన అధికారుల నుంచి సర్వీస్ గన్స్ స్వాధీనం చేసుకోవడం లేదని తెలుస్తుంది. 9ఎంఎం పిస్టల్‌కు సంబంధించి బుల్లెట్లు కూడా బయట దొరకవని పోలీసులు అనుకుంటున్నారు. ఏదేమైనా గన్ మిస్సింగ్ వ్యవహారం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.