బెర్లిన్: ఇస్లాం వ్యతిరేక కార్యక్రమంలో ఒక వ్యక్తి రెచ్చిపోయాడు. కత్తితో పలువురిని పొడిచాడు. (Man stabs multiple in Germany) ఆ వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఆ వ్యక్తితో సహా ఎనిమిది మంది గాయపడ్డారు. జర్మనీలోని మ్యాన్హైమ్లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ‘యాంటీ-ఇస్లాం’పై ఒక సభ జరిగింది. సిటిజన్స్ మూవ్మెంట్ పాక్స్ ఐరోపా సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉదయం 11 గంటలకు ఆ ప్రాంగణం వద్ద మాట్లాడేందుకు ఒక వ్యక్తి సిద్ధమయ్యాడు. ఇంతలో కత్తిని చేతపట్టిన ఒక వ్యక్తి అలజడి సృష్టించాడు. కత్తితో పలువురు వ్యక్తులపై దాడి చేశాడు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ వ్యక్తిపై కాల్పులు జరిపారు. గాయపడిన అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఆ వ్యక్తి దాడిలో ఒక పోలీస్ సహా ఏడుగురు గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో మెట్రో రైళ్లను కొన్ని గంటలు నిలిపివేశారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు లైవ్‌స్ట్రీమ్‌లో ఆ వ్యక్తి కత్తితో పలువురిపై దాడి చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
🇩🇪 | El vídeo completo del ataque islamista en Mannheim. pic.twitter.com/7BBnDRjoiu
— ʜᴇʀQʟᴇs (@herqles_es) May 31, 2024