Avika Gor |సోషల్ మీడియాలో తన గురించి వైరల్ అవుతున్న ప్రెగ్నెన్సీ వార్తలపై నటి అవికా గోర్ గట్టిగా స్పందించింది. ఎలాంటి ఆధారం లేకుండా తన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారాలు చేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. నెటిజన్లలో చక్కర్లు కొడుతున్న ఈ రూమర్స్‌లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసిన అవికా, ఇలాంటి నిరాధార వార్తలను నమ్మవద్దని అభిమానులను కోరింది. ఈ సందర్భంగా అవికా మాట్లాడుతూ, “నా గురించి వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్స్ అన్నీ పూర్తిగా ఫేక్. అలాంటిదేమీ జరగలేదు. దయచేసి అబద్ధపు వార్తలను నమ్మకండి” అంటూ స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది.
అయితే అదే సమయంలో ఆమె మరో ఆసక్తికర వ్యాఖ్య చేసింది. “ఇంకో నిజమైన వార్త మాత్రం ఉంది. అది ఏంటో త్వరలోనే అందరితో పంచుకుంటాం” అని చెప్పడంతో, ఆమె నుంచి రాబోయే గుడ్ న్యూస్ ఏంటన్న ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. ఈ కామెంట్స్‌తో సోషల్ మీడియాలో మరోసారి చర్చ మొదలైంది. టెలివిజన్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీకి విజయవంతంగా అడుగుపెట్టిన అవికా గోర్, తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల ఆమె వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలుస్తోంది. 2025లో తన దీర్ఘకాల బాయ్‌ఫ్రెండ్ మిలింద్ చాంద్వానితో అవికా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో ఒక స్నేహితుడి పార్టీ సందర్భంగా పరిచయం అయిన వీరి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. జూన్ 2025లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, ఆ తర్వాత తమ బంధాన్ని మరింత బలపర్చుకుంది.
ఇద్దరూ కలిసి ‘పతి పత్నీ ఔర్ పంగా’ అనే షోలో పాల్గొనడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ షో సెట్స్‌లోనే వీరు వివాహం చేసుకోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. పెళ్లి తర్వాత కూడా అవికా తన కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిన అవికా, తాను త్వరలో చెప్పబోయే మరో నిజమైన వార్త ఏమిటన్న దానిపై అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆ గుడ్ న్యూస్ ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించినదా? లేక వ్యక్తిగత జీవితానికి సంబంధించినదా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.