Glenn Maxwell | సిడ్నీ: భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ టెస్టులలో సుమారు 40 శతకాలు చేస్తాడని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అభిప్రాయపడ్డాడు. ‘ది గ్రేడ్ క్రికెటర్’ అనే పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మ్యాక్సీ మాట్లాడుతూ.. ‘టెస్టులలో జైస్వాల్ 40 కంటే ఎక్కువ సెంచరీలు చేస్తాడు. అంతేగాక అతడు తన పేరు మీద కొన్ని ప్రత్యేకమైన రికార్డులను సృష్టించుకుంటాడు.
ఎలాంటి పరిస్థితులనైనా తనకు అనుకూలంగా మలుచుకునే సామర్థ్యం అతడికుంది. అతడి ఫుట్‌వర్క్ అద్భుతం. అదీగాక అతడి బ్యాటింగ్‌లో లోపాలు వెతకడానికి పెద్దగా తప్పులు కనిపించడం లేదు. స్పిన్‌ను, పేస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. బంతిని బాగా డ్రైవ్ చేస్తున్నాడు. రాబోయే టెస్టులలో అతడిని ఆపకుంటే ఆస్ట్రేలియాకు మరిన్ని తిప్పలు తప్పవు’ అంటూ వ్యాఖ్యానించాడు.