సిడ్నీ: సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌ను ఇండియా స్టార్ట్ చేసింది. అయితే స్టార్క్ వేసిన తొలి ఓవర్లోనే.. జైస్వాల్(Yashasvi Jaiswal) బౌండరీలతో చెలరేగిపోయాడు. ఆ ఓవర్లో అతను నాలుగు బౌండరీలు కొట్టాడు. వీలైనంత వరకు వేగంగా స్కోర్ చేయాలన్న ఉద్దేశంతో జైస్వాల్ బ్యాటింగ్ చేస్తున్నట్లు కనిపించాడు. ఇండియాకు తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఓవర్లో 16 పరుగులు సమర్పించుకున్న స్టార్క్.. తన రెండో ఓవర్‌ను మాత్రం మెరుగ్గా వేశాడు. ఆ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. తాజా సమాచారం ప్రకారం ఇండియా తన రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 25 రన్స్ చేసింది. మొత్తం 29 రన్స్ ఆధిక్యంలో ఇండియా ఉన్నది.